telangana
జాతీయ కబడ్డీ పోటీలకు కాసాని అకాడమీ క్రీడాకారిణులు* *నీరజ, నిషా ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు*
నిజాంపేట్ మేజర్ న్యూస్ 52వ జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు కాసాని కబడ్డీ అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారిణులు నీరజ, నిషా ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పోటీలకు వీరిద్దరూ ఎంపిక కావడం పట్ల కాసాని కబడ్డీ అకాడమీ యాజమాన్యం, కోచ్‌లు, క్రీడాకారులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. చిన్న వయసు నుంచే కబడ్డీపై ఆసక్తి పెంచుకుని నిరంతరం సాధన, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగిన నీరజ, నిషా తమ ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం అకాడమీకి గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. వీరి ఎంపిక అకాడమీలో శిక్షణ పొందుతున్న ఇతర క్రీడాకారిణులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. క్రీడాకారిణులకు క్రమం తప్పకుండా శిక్షణ అందిస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచిన కోచ్‌లు అతియా సుల్తానా, అంజిలకు అకాడమీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే క్రీడాకారిణులకు నిరంతరం ప్రోత్సాహం, సహకారం అందిస్తున్న తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి చంద్రహాస్, అకాడమీ ఇన్‌చార్జి రాము, అకాడమీ మేనేజర్ షకీల్‌కు అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో నీరజ, నిషా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని, తెలంగాణతో పాటు దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకులు ఆకాంక్షించారు. జాతీయ స్థాయికి ఎంపికైన ఈ క్రీడాకారిణులను పలువురు అభినందించి భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శుభాకాంక్షలు తెలిపారు.