చింతలచెరువు పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్ప
బద్వేల్ మేజర్ న్యూస్
కడప జిల్లా బద్వేల్ మండలం చింతలచెరువు పంచాయతీ లో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని గురువారం జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాథ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించి, ఎన్నికల నిర్వహణపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు
రిపోర్టర్ సి రవికుమార్ బద్వేల్ ఇంచార్జ్, కడప జిల్లా