జాతీయ అండర్ 19-హ్యాండ్ బాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక
పులివెందుల మేజర్ న్యూస్:
జాతీయ స్థాయి అండర్- 19 హ్యాండ్ బాల్ పోటీలకు నల్లపపురెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థినిలు ఎంపికైనారు.ఈ నెల 14 నుండి 16వ తేది వరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్ జిల్లా అండర్ 19 బాలికల హ్యాండి్బాల్ పోటీలలో కడప జిల్లా అండర్ 19 బాలికల జట్టు రాష్ట్ర స్థాయి లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగినది. ఈ అంతర్ జిల్లా హ్యాండి్బాల్ పోటీలలో కడప జిల్లా జట్టు బ్రంజ్ మెడల్ సాధించడంలో మంచి ప్రతిభ కనపరిచిన M. లిఖిత మరియు M. గీతా లు జాతీయ స్థాయి అండర్ 19 హ్యాండి్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైనారు.ఈ జాతీయ స్థాయి అండర్ 19 బాలికల హ్యాండి్బాల్ పోటీలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము లోని ఘుమర్విన్ లో జనవరి నెల 28 నుండి 22 వరకు జరుగును.వీరిలో లిఖిత మరియు గీతా లు నల్లపురెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10 వ తరగతి చదువు తున్నారు.ఈ పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి అండర్ 19 హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవిచంద్రారెడ్డి గారు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
పి. కృష్ణ. పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా