నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ
నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ
పెద్దకొత్తపల్లి. సూర్య న్యూస్ : మండలం మరికల్ గ్రామానికి చెందిన కాకం శ్రీరాములు, కాకం అశోక్‌ల ఆహ్వానం మేరకు వారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో, మైసమ్మ చైర్మన్ బుడుగు శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేకల చంద్రయ్య, శివశంకర్, యువ నాయకుడు కొల్లె ఈశ్వర్, ఆరో వార్డు సభ్యుడు ఎండీ సలీం, మారేడు నారాయణ, పుట్ట రామకృష్ణ, మనమోని రాములు, కాకం లింగస్వామి, ముదంగుల రాముడు, పుట్ట బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.