నా ఓటు నేను తుది శ్వాస విడిచేంతవరకు నా ఓటు వేస్తా 102 ఏళ్ల వయసులోనూ ఓటు కోసం బూత్ కి వచ్చిన చెంచమ్మ..
బద్వేల్ మేజర్ న్యూస్
కడప జిల్లా బద్వేల్ మండలం చింతలచెరువు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా102 ఏళ్ల వయసులోనూ ఓటు వేసేందుకు చింతలచెరువుపోలింగ్ కేంద్రానికి కి వచ్చిన అంబవరం చెంచమ్మ తన ఓటును వినియోగించుకునేందుకు రావడంతో అక్కడ పోలింగ్ బూత్ లో వేచి ఉన్న ఓటర్లు ఆ వృద్ధ మహిళను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓటు కోసం నడవలేని స్థితిలో కేంద్రం వద్దకు రావడంతో ఓటర్ల అక్కడ విధులో పోలీస్ సిబ్బందికి ఆశ్చర్యానికి గురి చేసింది. పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న బద్వేల్ అర్బన్ సీఐ రామకృష్ణ మానవ త్వం చాటుకూని పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన చెంచమ్మను సాదరంగా ఆహ్వానించి ఆమెను బద్వేల్ అర్బన్ సిఐ రామకృష్ణ వృద్ధ మహిళ ను దగ్గరుండిప్రత్యేక క్యూ లైన్ ద్వారా పోలింగ్ కేంద్రం లేదు తీసుకువెళ్లి ఆమె ఓటు హక్కును వినియోగించు కొనేలా ప్రత్యేక చర్యలు చేపట్టాడు. అనంతరం సిఐ రామకృష్ణా పెద్దావిడతో నడవడానికి ఓపిక లేక పోయినా ఓటు వేయడానికి వచ్చిన ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అంబ వరం చెంచమ్మ నా ఓటు నా హక్కును నేను తుది శ్వాస విడిచేంతవరకు ఓటు వేస్తానని వివరించడంతో బూత్ వద్ద ఉన్న ఓటర్లు ఆమెకు అభినందనలు తెలిపారు. బద్వేల్ అర్బన్ సీఐ రామకృష్ణ పోలీస్ సిబ్బంది అవ్వను చేతులు పట్టుకుని, భద్రంగా కారులో కూర్చోబెట్టి ఇంటికి పంపించడం పట్ల పోలీసులు మానవత్వం చాటుకుంటారని అభినందనలు తెలిపారు.