BREAKING
ప్రపంచ కీలక బ్యాంకుల జాబితాలో బీఎన్‌పీ పారిబాస్ స్థానం పెంపు.. నార్స్ అట్లాంటిక్ విమాన సేవల నిలిపివేత.. అమెరికా ఆర్థిక వృద్ధి కొనసాగింపు.. ధరల ఒత్తిడి తగ్గలేదని ఫెడరల్ రిజర్వు తాజా నివేదిక: అమెరికా ఆంక్షలను దాటుకుని చైనాకు కృత్రిమ మేధ చిప్‌లు ఎలా చేరాయి? కొత్త వివరాలు వెల్లడించిన రాయిటర్స్: అమెరికా కరువు ముందస్తు హెచ్చరిక వ్యవస్థకు నిధుల కొరత.. నెతన్యాహుకు ఊరట కలిగించే న్యాయస్థాన సిఫార్సు.. జపాన్‌లో వడ్డీ రేట్ల పెంపు వేగవంతం కావాల్సిందే.. కేంద్ర బ్యాంకు సభ్యుడు తమురా కీలక వ్యాఖ్యలు: చింతలచెరువు పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్ప కృత్రిమ మేధ సమాచార కేంద్రాలతో విమాన సరుకు రవాణాకు భారీ డిమాండ్.. ఇండోనేషియాలో అక్రమ బంగారు గనిలో భారీ విషాదం.. నూతన డీఆర్‌డీఓ పీడీకి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు ముస్తాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో సమయపాలనకు మంగళం! ఎన్విడియా అధిపతి వ్యవహారంపై అమెరికా గూఢచారి సంస్థల్లో భిన్నాభిప్రాయాలు: టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలో దుండగుల చేతివాటం నా ఓటు నేను తుది శ్వాస విడిచేంతవరకు నా ఓటు వేస్తా 102 ఏళ్ల వయసులోనూ ఓటు కోసం బూత్ కి వచ్చిన చెంచమ్మ..

ముస్తాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో సమయపాలనకు మంగళం!

Select Suryaa Now
ముస్తాబాద్  ఎంపీడీవో కార్యాలయంలో సమయపాలనకు మంగళం!

సూర్య ముస్తాబాద్..జూనియర్ అసిస్టెంట్ మణిదీప్‌ను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్న అటెండర్.. విధుల నిర్వహణపై ప్రశ్నలు!..ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బాధ్యత ఉంది. కానీ ముస్తాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ మణిదీప్ సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు అటెండర్ తన ద్విచక్ర వాహనంపై జూనియర్ అసిస్టెంట్‌ను తీసుకెళ్తున్న దృశ్యం చర్చనీయాంశంగా మారింది.అసలు జూనియర్ అసిస్టెంట్ విధులకు నిర్ణీత సమయానికి హాజరవుతున్నారా? అటెండర్ ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లడం వెనుక కారణాలేమిటి? ఇది కార్యాలయ విధుల్లో భాగమా? లేక వ్యక్తిగత వ్యవహారమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల నిర్వహణ, సమయపాలనపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంపై ఎంపీడీవో స్పందించి వాస్తవాలను వెల్లడించాలని, సిబ్బంది హాజరు, విధుల నిర్వహణపై పరిశీలన చేయాలని స్థానికులు కోరుతున్నారు.