BREAKING
అదానీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి రూ.2,000 కోట్ల వరకు బాండ్ల జారీకి సన్నాహాలు: ఉక్రెయిన్ యుద్ధం మరింత విస్తరించొద్దు.. రష్యాకు ట్రంప్, నాటో అధిపతి సంయుక్త విజ్ఞప్తి: లాభాల జోరుకు స్వల్ప విరామం.. సెన్సెక్స్ 84,156 వద్ద, నిఫ్టీ 25,851 అమెరికా పిల్లలకు రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన: ప్రతి కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి హమీ టాటా గ్రూపులో మరోసారి నాయకత్వ వివాదం.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై బాంబే హైకోర్టును ఆశ్రయించనున్న టాటా ట్రస్ట్స్: అమెరికా డాలర్ నిలకడ.. బాండ్ రాబడులు తగ్గడంతో యెన్‌కు స్వల్ప బలం: హక్కుల సాధనకు బాధ్యతే పునాది : హెచ్ఎం ఢీ.శేఖర్ ఆసియా మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్ల జోరు.. నిక్కీ 1.6 శాతం, కొరియా సూచీ 1.9 శాతం పెరుగుదల పుట్టయిపల్లె పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన డీఎస్పీ భవాని నంద్యాల జిల్లాలో 08 మండలాలలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతం-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ అంబేద్కర్‌కు ఘన నివాళి అర్హులైన ప్రతి కుటుంబం భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - సర్పంచ్ చౌదరి నారాయణ *జగదేవ్‌పూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ పీఠిక పఠనం* శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం – ఎంపీ గురుమూర్తి

నంద్యాల జిల్లాలో 08 మండలాలలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతం-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్

Select Suryaa Now
నంద్యాల జిల్లాలో 08 మండలాలలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతం-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్

సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల జిల్లాలో నంద్యాల మండలంలో రెండు మండలాలు మరియు ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ మొదటి విడత (First Phase) ఎన్నికల పోలింగ్ అన్ని ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. మొత్తం 107 గ్రామ పంచాయతీలలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా సాగుతోంది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ర్యాంకుల పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలను పూర్తి శాంతియుత వాతావరణంలో నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎవరూ ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు సృష్టించకుండా సంయమనం పాటించాలని సూచించారు. ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని, అనంతరం తమ ఇళ్లకు వెళ్లాలని కోరారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఓటర్లందరూ తమ విలువైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ మరియు ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి సహకరిస్తూ, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించాలని కోరారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*