రాజ్యాంగ హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
సూర్య జగిత్యాల ప్రతినిధి:భారత రాజ్యాంగం బహుజన, అణగారిన వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రాథమిక హక్కులు కల్పించిందని జగిత్యాల జిల్లా మా ఐక్య వేదిక అధ్యక్షులు, ఆర్.ఎం.పి . డాక్టర్ల ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ సూరమళ్ల సతీష్ అన్నారు.నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిక్కీ కో ఆర్డినేటర్ నల్ల శ్యామ్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ ఆయన ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.