ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
సూర్య బెజ్జుర్: కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం పరిధిలోని పర్ధన్ గూడ ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, విద్యార్థులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. విద్యార్థులచే భారత రాజ్యాంగ పీఠికను చదివించి భారతదేశంలో రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను వివరించారు.ప్రతి ఒక్క విద్యార్థి బాల్య దశ నుండే భారత రాజ్యాంగ మూలాలను తెలుసుకోవాలని సూచించారు.