BREAKING
పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! ఏటవాకిలి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మోపురి మోహన్ ! ప్రభుత్వ వైద్య కళాశాల (GMC), రాజమహేంద్రవరంలో భారత రాజ్యాంగ దినోత్సవం కార్మికులతో మేయర్ రమేష్ గౌడ్ ఆత్మీయ ముచ్చట్లు ఓటీటీలోకి వస్తున్న రూ.450 కోట్ల బ్లాక్‌బస్టర్ హనుమాన్ అన్ష్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే? కౌంటింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్జీ దక్షిణ భారతదేశం నుంచి ఆస్ట్రేలియా రాజకీయ రంగానికి........ దివంగత హాస్యనటుడు ఎంఎస్ నారాయణ మనవరాలి పెళ్లి వేడుక.. హాజరైన నటుడు రావు రమేష్ ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం - నగర మేయర్ దర్ని మధుకర్ కేరళ బంపర్ లాటరీ: రూ.25 కోట్ల భారీ జాక్‌పాట్.. ప్రారంభించిన సీఎం వి.డి. సతీశన్ ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు స్కూటీని ఢీకొన్న కారు.. వ్యక్తి అక్కడికక్కడే మృతి పాల కేంద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సీనియర్ నాయకుడు ధర్మాన అరెస్ట్ ప్రజాస్వామ్యం ఖునియే... సీనియర్ నాయకుడు ధర్మాన అరెస్ట్ ప్రజాస్వామ్యం ఖునియే... గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్.. డిసెంబర్ 4న నాగచైతన్య మిస్టీరియస్ అడ్వెంచర్ రిలీజ్ రామాయణం టీమ్‌తో అమిత్ షా భేటీ.. ఇతిహాస చరిత్రపై ఆసక్తికర చర్చ, చిత్ర బృందానికి అభినందనలు

ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం - నగర మేయర్ దర్ని మధుకర్

Select Suryaa Now
ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం - నగర మేయర్ దర్ని మధుకర్

సూర్య నస్పూర్ : కుటుంబ పెద్దను కోల్పోయిన పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన లక్ష్యమని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. నస్పూర్   9 వ డివిజన్ ప్రశాంత్ నగర్ , 32వ డివిజన్ ఏఎస్ఆర్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రాలను గురువారం మేయర్ సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా, నమోదు వివరాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబంలో ఒకరికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడంతో పాటు, ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారం, మార్గదర్శకత్వంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పేద కుటుంబాలకు గొప్ప ఆర్థిక భరోసా అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.