BREAKING
పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! ఏటవాకిలి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మోపురి మోహన్ ! ప్రభుత్వ వైద్య కళాశాల (GMC), రాజమహేంద్రవరంలో భారత రాజ్యాంగ దినోత్సవం కార్మికులతో మేయర్ రమేష్ గౌడ్ ఆత్మీయ ముచ్చట్లు ఓటీటీలోకి వస్తున్న రూ.450 కోట్ల బ్లాక్‌బస్టర్ హనుమాన్ అన్ష్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే? కౌంటింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్జీ దక్షిణ భారతదేశం నుంచి ఆస్ట్రేలియా రాజకీయ రంగానికి........ దివంగత హాస్యనటుడు ఎంఎస్ నారాయణ మనవరాలి పెళ్లి వేడుక.. హాజరైన నటుడు రావు రమేష్ ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం - నగర మేయర్ దర్ని మధుకర్ కేరళ బంపర్ లాటరీ: రూ.25 కోట్ల భారీ జాక్‌పాట్.. ప్రారంభించిన సీఎం వి.డి. సతీశన్ ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు స్కూటీని ఢీకొన్న కారు.. వ్యక్తి అక్కడికక్కడే మృతి పాల కేంద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సీనియర్ నాయకుడు ధర్మాన అరెస్ట్ ప్రజాస్వామ్యం ఖునియే... సీనియర్ నాయకుడు ధర్మాన అరెస్ట్ ప్రజాస్వామ్యం ఖునియే... గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్.. డిసెంబర్ 4న నాగచైతన్య మిస్టీరియస్ అడ్వెంచర్ రిలీజ్ రామాయణం టీమ్‌తో అమిత్ షా భేటీ.. ఇతిహాస చరిత్రపై ఆసక్తికర చర్చ, చిత్ర బృందానికి అభినందనలు

ఓటీటీలోకి వస్తున్న రూ.450 కోట్ల బ్లాక్‌బస్టర్ హనుమాన్ అన్ష్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Select Suryaa Now
ఓటీటీలోకి వస్తున్న రూ.450 కోట్ల బ్లాక్‌బస్టర్ హనుమాన్ అన్ష్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ.450 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించిన భక్తిరస చిత్రం హనుమాన్ అన్ష్ ఎట్టకేలకు డిజిటల్ వేదికపై అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర, ఆయన బోధనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సంబంధించి ఆసక్తికరమైన ప్రకటన వెలువడింది. కేవలం ఒకే ప్లాట్‌ఫామ్‌కు పరిమితం కాకుండా, భాషల వారీగా రెండు వేర్వేరు దిగ్గజ ఓటీటీ వేదికలపై ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండటం విశేషం.  

తొలుత ఈ సినిమా నవంబర్ 27 నుంచి సోనీలివ్ వేదికగా అన్ని భాషల్లో అందుబాటులోకి వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా స్ట్రీమింగ్ ప్లాన్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. తాజా అధికారిక సమాచారం ప్రకారం, నవంబర్ 27వ తేదీ నుంచి సోనీలివ్‌లో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 29వ తేదీ నుంచి హనుమాన్ అన్ష్ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.  

విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించగా, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి కీలక పాత్రలు పోషించారు. విడుదలైన మొదటి రెండు వారాల్లో సాధారణ వసూళ్లతో మొదలైన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి వచ్చిన అనూహ్య మౌత్ టాక్‌తో మూడో వారం నుంచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. దాదాపు రూ.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై, ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.  

విడుదలకు ముందు ఓటీటీ హక్కుల విషయంలో నిరాశ ఎదుర్కొన్న ఈ చిత్రం, థియేటర్లలో సాధించిన చారిత్రాత్మక విజయంతో ఇప్పుడు రెండు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆధ్యాత్మిక భావనలు, సేవా దృక్పథం, భక్తి శ్రద్ధలతో కూడిన ఈ హృద్యమైన కథనాన్ని థియేటర్లలో మిస్ అయిన తెలుగు ప్రేక్షకులు నవంబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.