కౌంటింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్జీ
కౌంటింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి
జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్జీ
హొళగుంద, సూర్య ప్రతినిధి:
గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలు, వార్డు సభ్యుల స్థానాల కౌంటింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్జీ మండల అధికారులకు తెలియజేశారు.గురువారం హొళగుంద మండలంలోని కోగిలతోట,హొళగుంద,
హోన్నూర్,మార్లుమడికి గ్రామాలను సందర్శించి పోలింగ్ బూత్లను పరిశీలించారు,అదేవిధంగా హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగే కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి పకడ్బందీగా కౌంటింగ్ ను నిర్వహించాలని అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఓటింగ్ శాతం తక్కువగా జరిగిందన్నారు.వెంట తాసిల్దార్ లక్ష్మీ రాజ్, ఎంపీడీవో సయ్యద్ ఉమర్, గ్రామ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.