ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగాన్ని అవమానపరిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదు
సూర్య, సుల్తానాబాద్
77వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా రాజ్యాంగ వేడుకలను నిర్వహించారు. కౌన్సిలర్లు ఉట్ల వర ప్రదీప్, బాకమ్ సాయికిరణ్ యాదవ్, అంబేద్కర్ సంఘం నేతలు న్యాతరి ప్రభాకర్, సంకెనపల్లి లక్ష్మణ్, న్యాతరి శ్రీనివాస్, చిలుక రాజేశం, ఆరేపల్లి ఇలా రావు తదితరులు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ నిద్రాహారాలు మాని, తన కుటుంబాన్ని సైతం లెక్క చేయక సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కొరకు పెద్ద ఎత్తున అధ్యయనం చేసిన అనంతరం భారత రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. అలాంటి మహనీయుని జీవిత చరిత్రను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాలలో చేర్చి అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా కృషి చేయాలని కోరారు. భారత రాజ్యాంగంలో అమలుపరిచిన ఆర్టికల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని అవమానపరచడం, రాజ్యాంగాన్ని మార్చడం వంటి చర్యలకు పూనుకుంటే ఎంతటి వారినైనా సహించేది లేదని వారు హెచ్చరించారు. ఇకనైనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అలవర్చుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉట్ల వర ప్రదీప్, బాకం సాయికిరణ్ యాదవ్, అంబేద్కర్ సంఘం నేతలు న్యాతరి ప్రభాకర్, సంకెనపల్లి లక్ష్మణ్, న్యాతరి శ్రీనివాస్, చిలుక రాజేశం, ఏనగందుల నాంపల్లి, పల్లె శ్రీనివాస్, రుద్రారపు నరసయ్య, ఆరెపల్లి ఇలా రావు, మహంకాళి శంకరయ్య, న్యాతరి రాజ్ కుమార్, వెంకటేష్, న్యాతరి రమేష్ మామిడిపల్లి శ్రీకాంత్, కొండ్ర ప్రణయ్, తోపాటు అంబేద్కర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.