BREAKING
ప్రపంచాన్ని వణికించిన మొసాద్ సీక్రెట్ ఆపరేషన్ నేపథ్యంలో థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో దూసుకుపోతున్న ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫియర్ పోలింగ్ కేంద్రంలో వైద్య శిబిరం ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగాన్ని అవమానపరిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వాములైన మహనీయులందరినీ స్మరించుకోవాలి - జిల్లా కలెక్టర్ బాలీవుడ్ నిర్మాత అమిత్ తులి వివాహం.. పెళ్లి ఫోటోలు పంచుకున్న కంగనా రనౌత్ కొత్త ఇంటి కోసం ఎన్టీఆర్ అరుదైన కళాసేకరణ.. తారక్ నివాసానికి చేరిన తోట వైకుంఠం స్పెషల్ పెయింటింగ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన నంద్యాల జెడ్పీ చైర్మన్ షేక్ బృహనుద్దీన్ ఆహార పదార్థాలపై ఉప్పు, చక్కెర, కొవ్వుకు వేర్వేరు హెచ్చరికలు తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు: అదానీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి రూ.2,000 కోట్ల వరకు బాండ్ల జారీకి సన్నాహాలు: ఉక్రెయిన్ యుద్ధం మరింత విస్తరించొద్దు.. రష్యాకు ట్రంప్, నాటో అధిపతి సంయుక్త విజ్ఞప్తి: లాభాల జోరుకు స్వల్ప విరామం.. సెన్సెక్స్ 84,156 వద్ద, నిఫ్టీ 25,851 అమెరికా పిల్లలకు రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన: ప్రతి కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి హమీ టాటా గ్రూపులో మరోసారి నాయకత్వ వివాదం.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై బాంబే హైకోర్టును ఆశ్రయించనున్న టాటా ట్రస్ట్స్: అమెరికా డాలర్ నిలకడ.. బాండ్ రాబడులు తగ్గడంతో యెన్‌కు స్వల్ప బలం:

మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన నంద్యాల జెడ్పీ చైర్మన్ షేక్ బృహనుద్దీన్

Select Suryaa Now
మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన నంద్యాల జెడ్పీ చైర్మన్ షేక్ బృహనుద్దీన్

సూర్య, నంద్యాల బ్యూరో: నంద్యాల పట్టణంలోని మంత్రిగారి క్యాంపు కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని, నూతనంగా ఎన్నికైన నంద్యాల జిల్లా పరిషత్ చైర్మన్ షేక్ బృహనుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన జిల్లాగా ఏర్పడిన నంద్యాల జిల్లా తొలి జెడ్పీ పీఠాన్ని అధిష్టించిన సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి షేక్ బృహనుద్దీన్ గారు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ నూతన జెడ్పీ చైర్మన్ బృహనుద్దీన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడికి జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా పరిషత్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ షేక్ బృహనుద్దీన్ మాట్లాడుతూ మంత్రి ఫరూక్ గారి మార్గదర్శకత్వంలో, జిల్లాలోని ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమన్వయంతో నంద్యాల జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు , 28 వ వార్డు టిడిపి కౌన్సిలర్ కోమల మధు , మూలమటం చైర్మన్ పసుపులేటి నారాయణ మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ,  ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*