రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వాములైన మహనీయులందరినీ స్మరించుకోవాలి - జిల్లా కలెక్టర్
సూర్య, నంద్యాల బ్యూరో:జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా మరియు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవిస్తూ, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వాన్ని పరిరక్షించాలన్నారు
ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర బాధ్యతల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ రామునాయక్ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*