BREAKING
సీనియర్ నాయకుడు ధర్మాన అరెస్ట్ ప్రజాస్వామ్యం ఖునియే... సీనియర్ నాయకుడు ధర్మాన అరెస్ట్ ప్రజాస్వామ్యం ఖునియే... గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్.. డిసెంబర్ 4న నాగచైతన్య మిస్టీరియస్ అడ్వెంచర్ రిలీజ్ రామాయణం టీమ్‌తో అమిత్ షా భేటీ.. ఇతిహాస చరిత్రపై ఆసక్తికర చర్చ, చిత్ర బృందానికి అభినందనలు ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్  స్వీయ దర్శకత్వంలో అర్జున్ సర్జా భారీ దేశభక్తి చిత్రం.. అయోధ్యలో రేపు పూజా కార్యక్రమాలు రోప్ స్కిప్పింగ్ జిల్లా స్థాయి ఎంపికలు.. 70 మంది క్రీడాకారుల హాజరు ఈ నెల 29న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి టోర్నమెంట్ బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. ఒకేసారి అడుగుపెట్టిన డీమాన్ పవన్, రీతూ చౌదరి.. వర్షిణిపై అమన్ ఫైర్! ప్రపంచాన్ని వణికించిన మొసాద్ సీక్రెట్ ఆపరేషన్ నేపథ్యంలో థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో దూసుకుపోతున్న ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫియర్ పోలింగ్ కేంద్రంలో వైద్య శిబిరం ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగాన్ని అవమానపరిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వాములైన మహనీయులందరినీ స్మరించుకోవాలి - జిల్లా కలెక్టర్ బాలీవుడ్ నిర్మాత అమిత్ తులి వివాహం.. పెళ్లి ఫోటోలు పంచుకున్న కంగనా రనౌత్ కొత్త ఇంటి కోసం ఎన్టీఆర్ అరుదైన కళాసేకరణ.. తారక్ నివాసానికి చేరిన తోట వైకుంఠం స్పెషల్ పెయింటింగ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన నంద్యాల జెడ్పీ చైర్మన్ షేక్ బృహనుద్దీన్

ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ 

Select Suryaa Now
ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ 
న్యూఢిల్లీ: దేశ వ్యవసాయ రంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025-26 పంట సంవత్సరానికి సంబంధించి దేశంలో రికార్డు స్థాయిలో 378.53 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి నమోదైనట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. గత ఏడాది (2024-25)తో పోలిస్తే ఇది ఏకంగా 208 లక్షల టన్నులు అదనమని ఆయన పేర్కొన్నారు.

2025-26 పంట సంవత్సరానికి సంబంధించిన నాలుగో మరియు తుది పంట అంచనాలను (Final Crop Estimates) మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగ పురోగతిని వివరిస్తూ, దేశంలో వరి ఉత్పత్తి గత ఏడాది కంటే 49.70 లక్షల టన్నులు పెరిగి 155.15 మిలియన్ టన్నులకు చేరిందని తెలిపారు. ఈ ఘనతతో చైనాను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించింది. అదేవిధంగా గోధుమల దిగుబడి 122.06 మిలియన్ టన్నులుగా నమోదు కాగా, గోధుమ ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. కేవలం వరి, గోధుమలే కాకుండా మొక్కజొన్న, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు (272 లక్షల టన్నులు) మరియు నూనెగింజల సాగు, దిగుబడి కూడా గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు మంత్రి వివరించారు.

రైతుల అవిశ్రాంత కృషి, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్లే ఈ ఆల్-టైమ్ రికార్డు సాధ్యమైందని శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందించారు. ఎల్ నినో (El Niño), వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రాబోయే 2026-27 పంట సంవత్సరంలో కూడా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆశాజనకంగానే ఉంటుందని మొదటి ముందస్తు అంచనాల్లో ఆయన ధీమా వ్యక్తం చేశారు.