BREAKING
ఉత్తర్వుల ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పోలీసుల పనితీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి మాజీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! ఏటవాకిలి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మోపురి మోహన్ ! ప్రభుత్వ వైద్య కళాశాల (GMC), రాజమహేంద్రవరంలో భారత రాజ్యాంగ దినోత్సవం కార్మికులతో మేయర్ రమేష్ గౌడ్ ఆత్మీయ ముచ్చట్లు ఓటీటీలోకి వస్తున్న రూ.450 కోట్ల బ్లాక్‌బస్టర్ హనుమాన్ అన్ష్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే? కౌంటింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్జీ దక్షిణ భారతదేశం నుంచి ఆస్ట్రేలియా రాజకీయ రంగానికి........ దివంగత హాస్యనటుడు ఎంఎస్ నారాయణ మనవరాలి పెళ్లి వేడుక.. హాజరైన నటుడు రావు రమేష్ ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం - నగర మేయర్ దర్ని మధుకర్ కేరళ బంపర్ లాటరీ: రూ.25 కోట్ల భారీ జాక్‌పాట్.. ప్రారంభించిన సీఎం వి.డి. సతీశన్ ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

పోలీసుల పనితీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

Select Suryaa Now
పోలీసుల పనితీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

అహోబిలంలో పోలీసుల పనితీరుపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; మండలం లోని అహోబిలం గ్రామం సమస్యాత్మక గ్రామము అని తెలిసి కూడా పోలీసులు ముందస్తుగా ఏ బందోబస్తు ఏర్పాట్లు చేయకుండా వైసీపీ వైపు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ అహోబిలంలో  పోలీసుల తీరుపై మండిపడ్డారు. గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో విధులు నిర్వహించిన పోలీసులను ఇక్కడ డ్యూటీలకు నియమించడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. తాను అహోబిలానికి వస్తున్నట్లు వైసీపీ నేతలు ముందుగానే పసిగట్టి గ్రామ శివారులలో రాళ్లు, కారంపొడి, కర్రలతో దాడులకు దిగేందుకు  యత్నించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ  దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళితే తనను ఆయన అరెస్టు చేస్తామని అనడంపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే రాళ్ల దాడులకు దిగడం, కార్ల అద్దాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారని ఆరోపించారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా