పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
అహోబిలంలో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; మండలం లోని అహోబిలం గ్రామం సమస్యాత్మక గ్రామము అని తెలిసి కూడా పోలీసులు ముందస్తుగా ఏ బందోబస్తు ఏర్పాట్లు చేయకుండా వైసీపీ వైపు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ అహోబిలంలో పోలీసుల తీరుపై మండిపడ్డారు. గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో విధులు నిర్వహించిన పోలీసులను ఇక్కడ డ్యూటీలకు నియమించడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. తాను అహోబిలానికి వస్తున్నట్లు వైసీపీ నేతలు ముందుగానే పసిగట్టి గ్రామ శివారులలో రాళ్లు, కారంపొడి, కర్రలతో దాడులకు దిగేందుకు యత్నించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళితే తనను ఆయన అరెస్టు చేస్తామని అనడంపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే రాళ్ల దాడులకు దిగడం, కార్ల అద్దాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారని ఆరోపించారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా