పాలగిరి మహబూబ్ బాషాకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి... ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
నంబులపూలకుంట : కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధే ప్రథమ లక్ష్యమని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. ఎన్.పి. కుంట గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థి పాలగిరి మహబూబ్ బాషాకు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.పాలగిరి మహబూబ్ బాషాకు మంచం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రజలను కోరారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటు వంటి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత పార్థసారథి మాట్లాడుతూ కూటమిలోని భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తే విజయం తథ్యమని అన్నారు. గతంలో జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ కొందరు కుట్రపూరితంగా వ్యవహరించి మోసం చేశారని ఆరోపించారు. ఈసారి అలాంటి పరిస్థితులకు తావులేకుండా కూటమి అభ్యర్థి పాలగిరి మహబూబ్ బాషాకు మద్దతుగా ప్రతి ఒక్కరూ పనిచేసి గెలిపించాలని కోరారుకూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా కదిరి ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారా నీరు అందించడం శుభపరిణామమని నాయకులు పేర్కొన్నారు. సాగునీటి వసతులతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
శ్రీరాములు , ఎన్.పి.కుంట సూర్య రిపోర్టర్.