BREAKING
రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ గుడిపల్లి మండలంలో ప్రశాంతంగా ముగిసిన సర్పంచ్ ఎన్నికలు.. 84.9 శాతం పోలింగ్ నమోదు ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.. మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు పాలగిరి మహబూబ్ బాషాకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి... ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శ్రీవారికి భక్తుడి భారీ విరాళం.. 121 కిలోల బంగారు ఆభరణాల అందజేత.. మాయలూరు గ్రామంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అమ్మాపూర్‌లో భూ రీ-సర్వేపై గ్రామసభ ఉత్తర్వుల ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పోలీసుల పనితీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి మాజీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! ఏటవాకిలి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మోపురి మోహన్ ! ప్రభుత్వ వైద్య కళాశాల (GMC), రాజమహేంద్రవరంలో భారత రాజ్యాంగ దినోత్సవం కార్మికులతో మేయర్ రమేష్ గౌడ్ ఆత్మీయ ముచ్చట్లు

మాయలూరు గ్రామంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ

Select Suryaa Now
మాయలూరు గ్రామంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ

సూర్య, నంద్యాల బ్యూరో:
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం మాయలూరు గ్రామంలో జరుగుతున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అలాగే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.

*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*