గుడిపల్లి మండలంలో ప్రశాంతంగా ముగిసిన సర్పంచ్ ఎన్నికలు.. 84.9 శాతం పోలింగ్ నమోదు
మండలంలో 84.9 శాతం పోలింగ్ నమోదు.. పోలీసుల పటిష్ట బందోబస్తుకు ప్రశంసలు
గుడిపల్లి మేజర్ న్యూస్: గుడిపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మండల వ్యాప్తంగా మొత్తం 35,539 మంది ఓటర్లు ఉండగా, వారిలో 30,187 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మండలంలో మొత్తం 84.9 శాతం పోలింగ్ నమోదైనట్లు మండల ఎన్నికల అధికారి వెల్లడించారు.
ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. గుడిపల్లి ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ చేపట్టిన చర్యలు ఎంతగానో దోహదపడ్డాయి.
ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బంది కృషిపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.
సూర్య రిపోర్టర్ లెనిన్ గుడిపల్లి మండలం