BREAKING
ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వేంపల్లి అభివృద్ధికి... మంచం గుర్తుపై ఓటు వేయండి... పంచాయతీ సమగ్ర అభివృద్ధి లక్ష్యం నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం గ్రామ సమస్యల పరిష్కారం.. అభివృద్ధే నా ధ్యేయం: మద్దికుంట నర్మద 52వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం సచివాలయ సిబ్బందితో కార్పొరేటర్ పి.ఎస్. చందు సమావేశం.. సమస్యల పరిష్కారానికి కృషి. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ గుడిపల్లి మండలంలో ప్రశాంతంగా ముగిసిన సర్పంచ్ ఎన్నికలు.. 84.9 శాతం పోలింగ్ నమోదు ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.. మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు పాలగిరి మహబూబ్ బాషాకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి... ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శ్రీవారికి భక్తుడి భారీ విరాళం.. 121 కిలోల బంగారు ఆభరణాల అందజేత.. మాయలూరు గ్రామంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అమ్మాపూర్‌లో భూ రీ-సర్వేపై గ్రామసభ ఉత్తర్వుల ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పోలీసుల పనితీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ

Select Suryaa Now
రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ

వెల్దుర్తి,  మేజర్ న్యూస్: 77వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్యానికి పునాది వేసి, ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవంతో జీవించే హక్కులను కల్పించిన ఘనత భారత రాజ్యాంగానిదేనని కొనియాడారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదం పొందిన ఈ మహోన్నత గ్రంథం, 1950 జనవరి 26న అమల్లోకి వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగంగా నిలిచిందన్నారు.విభిన్న మతాలు, కులాలు, భాషలు, సంస్కృతుల కలయికైన భారతదేశంలో కులమతాలకతీతంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. బడుగు, బలహీన వర్గాలు అన్ని రంగాల్లో ముందుకు సాగేలా పాలకులు కృషి చేస్తూ, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరిస్తూ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలని, భవిష్యత్తులో రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు టైలర్ రాముడు, దానియేలు, టైలర్ కృష్ణ, మండల నాయకులు పుల్లయ్య, ఇజ్రాయిల్, ఆంజనేయులు, గడ్డ మద్దిలేటి, శివ తదితరులు పాల్గొన్నారు.