ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
సూర్య, సిర్పూర్ (టి) :- మండలం లోని పారిగాం గ్రామంలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ సంఘం ఆధ్వర్యంలో “భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ” పుస్తకాన్ని పాఠశాల హెచ్ఎం శ్రీదేవి, వార్డు సభ్యురాలు ఝాడే కవిత, జై భీమ్ నగర్ పారిగాం అధ్యక్షులు డుర్కే శ్రీధర్ చేతుల మీదుగా ఉచితంగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఝాడే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలోని అంశాలు, ప్రజలకు కల్పించిన హక్కులు, విధులు, రాజ్యాంగ సూత్రాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ పుస్తకంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 నుంచి 51 వరకు వివరాలతో కూడిన విశ్లేషణ ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే భారత రాజ్యాంగం గురించి తెలుసుకొని రాజ్యాంగ విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి ఝాడే అనిల్ కుమార్, ఝాడే చరణ్ దాస్, దుర్గం భీమ్ రావు, కుకుడ్కర్ సుమన్ బాయి, దుర్గం లచ్చుమ్ బాయి, చిలములే భాగ్య తదితరులు పాల్గొన్నారు.