BREAKING
చదువుకు ముందు పౌష్టిక అల్పాహారం! సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలిని ఆశీర్వదించండి.... ఎస్ వి సతీష్ రెడ్డి ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వేంపల్లి అభివృద్ధికి... మంచం గుర్తుపై ఓటు వేయండి... పంచాయతీ సమగ్ర అభివృద్ధి లక్ష్యం నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం గ్రామ సమస్యల పరిష్కారం.. అభివృద్ధే నా ధ్యేయం: మద్దికుంట నర్మద 52వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం సచివాలయ సిబ్బందితో కార్పొరేటర్ పి.ఎస్. చందు సమావేశం.. సమస్యల పరిష్కారానికి కృషి. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ గుడిపల్లి మండలంలో ప్రశాంతంగా ముగిసిన సర్పంచ్ ఎన్నికలు.. 84.9 శాతం పోలింగ్ నమోదు ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.. మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు పాలగిరి మహబూబ్ బాషాకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి... ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శ్రీవారికి భక్తుడి భారీ విరాళం.. 121 కిలోల బంగారు ఆభరణాల అందజేత.. మాయలూరు గ్రామంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అమ్మాపూర్‌లో భూ రీ-సర్వేపై గ్రామసభ ఉత్తర్వుల ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష

గ్రామ సమస్యల పరిష్కారం.. అభివృద్ధే నా ధ్యేయం: మద్దికుంట నర్మద

Select Suryaa Now
గ్రామ సమస్యల పరిష్కారం.. అభివృద్ధే నా ధ్యేయం: మద్దికుంట నర్మద

గ్రామ సమస్యల పరిష్కారం.. అభివృద్ధే నా ధ్యేయం: మద్దికుంట నర్మద

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

ఓర్వకల్లు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే తన ప్రధాన లక్ష్యమని టీడీపీ సర్పంచ్ అభ్యర్థి మద్దికుంట నర్మద తెలిపారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని  ఇంటింటికీ గ్రామ నాయకులు,కార్యకర్తలతో కలిసి వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తన కార్యాచరణను వివరించారు. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, కూటమి ప్రభుత్వ సహకారంతో అవసరమైన పనులు చేపడతానని భరోసా ఇచ్చారు. పదవిని బాధ్యతగా భావించి ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ ప్రగతికి నిరంతరం కృషి చేస్తానన్నారు. తనకు ఒక్క అవకాశం కల్పించి కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో నంద్యాల జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు చేట్ల దానమ్మ, టీడీపీ నాయకులు లక్ష్మీకాంతారెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీరామ్‌రెడ్డి, ఆయూబ్, యేసేపు, జీకే అల్లాబాబు ప్రచారంలో పాల్గొన్నారు.