BREAKING
చదువుకు ముందు పౌష్టిక అల్పాహారం! సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలిని ఆశీర్వదించండి.... ఎస్ వి సతీష్ రెడ్డి ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వేంపల్లి అభివృద్ధికి... మంచం గుర్తుపై ఓటు వేయండి... పంచాయతీ సమగ్ర అభివృద్ధి లక్ష్యం నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం గ్రామ సమస్యల పరిష్కారం.. అభివృద్ధే నా ధ్యేయం: మద్దికుంట నర్మద 52వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం సచివాలయ సిబ్బందితో కార్పొరేటర్ పి.ఎస్. చందు సమావేశం.. సమస్యల పరిష్కారానికి కృషి. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ గుడిపల్లి మండలంలో ప్రశాంతంగా ముగిసిన సర్పంచ్ ఎన్నికలు.. 84.9 శాతం పోలింగ్ నమోదు ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.. మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు పాలగిరి మహబూబ్ బాషాకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి... ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శ్రీవారికి భక్తుడి భారీ విరాళం.. 121 కిలోల బంగారు ఆభరణాల అందజేత.. మాయలూరు గ్రామంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అమ్మాపూర్‌లో భూ రీ-సర్వేపై గ్రామసభ ఉత్తర్వుల ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష

52వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం సచివాలయ సిబ్బందితో కార్పొరేటర్ పి.ఎస్. చందు సమావేశం.. సమస్యల పరిష్కారానికి కృషి.

Select Suryaa Now
52వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం సచివాలయ సిబ్బందితో కార్పొరేటర్ పి.ఎస్. చందు సమావేశం.. సమస్యల పరిష్కారానికి కృషి.

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు నగరపాలక సంస్థ 52వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికైన అనంతరం తొలిసారిగా గురువారం డివిజన్ సచివాలయాన్ని సందర్శించిన పి.ఎస్. చందుకు సచివాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
అనంతరం సచివాలయ సిబ్బందితో సమావేశమైన కార్పొరేటర్ డివిజన్‌లో నెలకొన్న ప్రధాన సమస్యలపై సమీక్షించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, పారిశుధ్యం, రహదారులు, ఇతర మౌలిక వసతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ పి.ఎస్. చందు మాట్లాడుతూ శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ సూచనలు, అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా మేయర్ కటారి హేమలత నాయకత్వంలో, డిప్యూటీ మేయర్ గోపినాథ్ సహకారంతో 52వ డివిజన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ డివిజన్‌లోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.తన తండ్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ పి. షణ్ముగం ఆశీస్సులు, సలహాలతో పాటు దివంగత తన సోదరి, పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీదుర్గ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవకు అంకితమవుతానని భావోద్వేగంగా పేర్కొన్నారు.
డివిజన్‌లోని పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారం, సలహాలతో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, 52వ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని కార్పొరేటర్ పి.ఎస్. చందు పేర్కొన్నారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్,  లవకుమార్