BREAKING
చదువుకు ముందు పౌష్టిక అల్పాహారం! సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలిని ఆశీర్వదించండి.... ఎస్ వి సతీష్ రెడ్డి ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వేంపల్లి అభివృద్ధికి... మంచం గుర్తుపై ఓటు వేయండి... పంచాయతీ సమగ్ర అభివృద్ధి లక్ష్యం నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం గ్రామ సమస్యల పరిష్కారం.. అభివృద్ధే నా ధ్యేయం: మద్దికుంట నర్మద 52వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం సచివాలయ సిబ్బందితో కార్పొరేటర్ పి.ఎస్. చందు సమావేశం.. సమస్యల పరిష్కారానికి కృషి. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ గుడిపల్లి మండలంలో ప్రశాంతంగా ముగిసిన సర్పంచ్ ఎన్నికలు.. 84.9 శాతం పోలింగ్ నమోదు ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.. మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు పాలగిరి మహబూబ్ బాషాకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి... ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శ్రీవారికి భక్తుడి భారీ విరాళం.. 121 కిలోల బంగారు ఆభరణాల అందజేత.. మాయలూరు గ్రామంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అమ్మాపూర్‌లో భూ రీ-సర్వేపై గ్రామసభ ఉత్తర్వుల ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష

వేంపల్లి అభివృద్ధికి... మంచం గుర్తుపై ఓటు వేయండి... పంచాయతీ సమగ్ర అభివృద్ధి లక్ష్యం

Select Suryaa Now
వేంపల్లి అభివృద్ధికి... మంచం గుర్తుపై ఓటు వేయండి... పంచాయతీ సమగ్ర అభివృద్ధి లక్ష్యం

వేంపల్లె మేజర్ న్యూస్:
స్థానిక పంచాయతీ అభివృద్ధికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాబాగౌస్(మొండోడు)కి మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎంపిపి రామమునిరెడ్డి, టిడిపి మైనార్టీ ఫైనాన్స్ సంస్థ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్, టిడిపి నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి(దిల్ మాంగే) లు ప్రజలను అభ్యర్థించారు. గురువారం స్థానిక పట్టణంలోని పలు ప్రాంతాల్లో విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తూ టిడిపి కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి అఖండమైన మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు. వేంపల్లె పంచాయతీ పరిధిలోని అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అనునిత్యం అందుబాటులో ఉండేలా ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తామని.. పంచాయతీని అన్ని విధాల అభివృద్ధి పరుస్తామని వెల్లడించారు. ఈనెల 29న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బాబా గౌస్ కి మంచం గుర్తుపై ఓటు వేయాలని అభివృద్ధికి బాసటగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు విధ్యార్థి విభాగ జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, ఎంపిటిసి మహమ్మద్, నాయకులు అబ్దుల్ వాహిద్, మడకశ్రీను, జబిబుల్లా, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : గండికోట షేక్ ఖదీర్
వేంపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లా.