andhrapradesh
ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్న 201 మండలాల పరిధిలోని 3,240 గ్రామ పంచాయతీల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంటతో ముగిసింది. అయితే, ఒంటి గంట సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసేందుకు అనుమతి కల్పించారు.
మొత్తం 74.45 లక్షల మంది ఓటర్లు ఈ తొలి విడత ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హత సాధించారు.
కాగా, రాష్ట్రంలో మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, తొలి విడత పోలింగ్ ఇవాళ ముగిసింది.