సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం:కాంగ్రెస్ పార్టీ పరిగి మండల అధ్యక్షుడు వెంకట్ రాములు
పరిగి,మేజర్ న్యూస్: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరం లాంటిదని అది ఎంతో సహాయపడుతుందనీ పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్ రాములు అన్నారు. పరిగి మండల పరిధిలోని రాపోలు గ్రామానికి చెందిన గండు మాణిక్యం కు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా రూ. 45000 చెక్కును మంగళవారం పిఏసిఎస్ డైరెక్టర్ నాగవర్ధన్ తో కలిసి బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో మేలు చేకూరుస్తుందని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజలు ప్రజలు ఎంతో అవస్థలు పడుతుంటారు వీరికి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.