BREAKING
దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎన్నికలు. చిప్ సరఫరా ఒప్పందాన్ని విస్తరించిన ఒరాకిల్.. గూగుల్, సెరెబ్రాస్ సేవలు జత సిమెన్స్ సంస్థకు $1.36 బిలియన్ల హైస్పీడ్ రైళ్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిన స్పానిష్ రెన్ఫే అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం. నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రాడికో ఖైతాన్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు మైల్వార్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం.. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి: కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు విష్ణువర్ధన్ డిమాండ్ జర్మనీ పారిశ్రామిక రంగంలో టీకే ఎలివేటర్ రికార్డు స్థాయి వార్షిక లాభాలు

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం..

Select Suryaa Now
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం..

నరసన్నపేట అక్టోబర్ 27 మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. నరసన్నపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నరసన్నపేట మండలంలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న కూటమి ఎంపీటీసీ అభ్యర్థులకు ఆయన, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చనతో కలిసి బీ-ఫారాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులంతా ఏకతాటిపై నిలిచి విజయానికి కృషి చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు నాయకులు, కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, సమన్వయంతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సూచించారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. బీ-ఫారాలు అందుకున్న అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.

రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలను కలుపుకొని గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు సమన్వయంతో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మహిళలు, యువత స్థానిక పాలనలో చురుకుగా పాల్గొంటూ మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల ఆదరణ, పార్టీ శ్రేణుల సమష్టి కృషితో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

బీ-ఫారాలు అందుకున్న అభ్యర్థులు తమకు అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానానికి, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి, బగ్గు అర్చనకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల మద్దతుతో విజయం సాధించేందుకు శ్రమిస్తామని పేర్కొన్నారు.