ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం
వత్సవాయి: వత్సవాయి మండలం వేమవరం ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యలమర్తి అనిత తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా తొలిరోజు ఆళ్ళురుపాడు గ్రామంలోని ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ, గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రజలకు జరిగిన ప్రయోజనాలను వివరిస్తూ ఆమె ప్రచారం కొనసాగించారు. అదేవిధంగా ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటి అమలుపై ప్రజలకు వివరిస్తూ ఓటర్ల మద్దతును కోరారు.
ప్రచారానికి వెళ్లిన యలమర్తి అనితకు పలువురు గ్రామస్థులు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారంలో ఆమెకు మద్దతుగా నిలిచారు.