BREAKING
ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు

31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్

Select Suryaa Now
31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి  భానుప్రియ ను గెలిపించండి...  డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్

తిరుపతి, మేజర్ న్యూస్:
31 వ డివిజన్ కార్పొరేటర్ గా  మండపాటి భానుప్రియను ఆదరించి గెలిపించాలని  ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తనయుడు, జనసేన పార్టీ రాష్ట్ర నేత ఆరని మదన్ ఓటర్లను అభ్యర్థించారు. మంగళవారం భానుప్రియ తరఫున 31వ డివిజన్లోని పలు ప్రాంతాలలో అరణి మదన్, ఊకా విజయ్ కుమార్, మధు  రాయల్, సతీష్ యాదవ్, కూటమి పార్టీల నేతలు నెహ్రు నగర్ వెంకటరమణ లేఔట్ ఎల్ఐసి రోడ్డు ఆర్ కె పురం ప్రాంతాలలో    ఇంటింటా ప్రచారం చేశారు. 
ఈ సందర్భంగా మీడియాతో ఆరణి మదన్ మాట్లాడుతూ మీ అందరికీ అందుబాటులో ఉండే సౌమ్యురాలు, విద్యావంతురాలు  అందరినీ ఆప్యాయంగా పలకరించే భానుప్రియకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. గత వైసిపి ప్రభుత్వంలో తిరుపతి నియోజకవర్గం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని అవినీతికి కేరాఫ్ గా తిరుపతి మారిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి నగరం తో పాటు అన్ని ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పారు. భానుప్రియను గెలిపిస్తే వార్డుల్లోని సమస్యలన్నిటిని పరిష్కరించడంతోపాటు పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. ఊకా విజయ్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేటర్ గా డివిజన్ ప్రజలు మందపాటి భానుప్రియ కు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా భానుప్రియ పలికే మనస్తత్వమని కావున ప్రజలు సీరియల్ నెంబరు ఒకటి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.

పలువురు జనసేన పార్టీలో చేరిక...

31వ డివిజన్లోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు ఎమ్మెల్యే తనయుడు అరణి మదన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో  బాబు, వెంకటేష్, ఎం పుణ్య, మధు, జయశంకర్ శంకర, శశి, అమల  ఉన్నారు. ఈ ప్రచారంలో మాజీ కార్పొరేటర్ రత్నమ్మ,
జనసేన పార్టీకి చెందిన ప్రభాకర్, అలాగని మురళీ గౌడ్, టిడిపి బూత్ ఇంచార్జ్ మధు ఆచారి, టీడీపీ బూత్ ఇంచార్జ్ లక్ష్మీ,  బీజేపీ బూత్ ఇంచార్జ్ నరసింహ రావు, హరిత,రేఖ   జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


DWARAKA.H
PH.NO: 9705347341