35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ
తిరుపతి,రెవెన్యూ,మేజర్ న్యూస్.
35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా....
పాలడుగు విజయ
స్థానిక ఎమ్మెల్యే, మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ తో ప్రచారంలో పాల్గొన్న పాలడుగు విజయ
తిరుపతి బ్యూరో,మేజర్ న్యూస్ :
తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 35 వ డివిజన్లో టిడిపి పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పాలడుగు విజయ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంగళవారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి, వారి సమస్య లను తెలుసుకుంటూ తనకు మద్దతు తెలిపి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పాలడుగు విజయ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల్లో విజయం సాధిస్తే 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. డివిజన్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా మెరుగుదల, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, అంతర్గత రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న
సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌ లిక వసతుల అభివృ ద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రజాప్రతినిధిగా పనిచేయడమే తన లక్ష్యమ ని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల అమలులో పారద ర్శకతకు ప్రాధాన్యం ఇస్తానని, ప్రజల నమ్మకాన్ని నిల బెట్టుకునేలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్థానని పాలడుగు విజయ పేర్కొన్నారు. ఈ ప్రచార కార్య క్రమం లో కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం, బీజెపీ శ్రేణులు, మహి ళలు, పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారంలో భాగ స్వా ములయ్యార
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి