BREAKING
పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు

కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం

Select Suryaa Now
కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం

కాశి విస్వేశ్వర చెంతన శ్రీమఠం నిర్మాణ చర్యలు

పవిత్ర గంగానదిలో పుణ్యస్నానం చేసిన శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థులు

మంత్రాలయం సూర్య ప్రతినిధి:
దక్షిణ భారతదేశంలో సజీవంగా బృందావనంలో ఉన్నటువంటి శ్రీ రాఘవేంద్ర స్వాముల విశిష్టతను ఉత్తరాది రాష్ట్రాలకు వ్యాప్తి చెందేలా శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభు దేంద్రతీర్థులు ఉత్తర భారత దేశ పర్యటన ను దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు.. మొన్న అయోధ్యలో శ్రీరాముని చందన మంత్రాలయం శ్రీమతం నిర్మాణానికి భూమి పూజ చేశారు.. ఈ దినం కాశీ విశ్వేశ్వరుని చెత్త శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని నిర్మాణానికి తల పరిశీలన గావించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తుల కోసం దేశ నలుమూలల శ్రీమఠం వ్యాప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది.. ఈ కోవలోనే 
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థులు మంగళవారం వారణాసి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారణాసిలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నిర్మాణం కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. మఠం నిర్మాణానికి సంబంధించి నాలుగు ప్రదేశాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తదుపరి అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.వారణాసిని సందర్శించే భక్తులు, శిష్యులకు అవసరమైన వసతులు కల్పించడంతోపాటు, సమీప విద్యాసంస్థల్లో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వసతి సౌకర్యాలు అందించేందుకు ప్రతిపాదిత నిర్మాణాలు ఉపయోగపడనున్నాయి.అనంతరం శ్రీ సుభుదేంద్రతీర్థులు తులసి ఘాట్ వద్ద పవిత్ర గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. భక్తులు, శిష్యుల సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మూలరామదేవర పవిత్ర గ్రంథాన్ని, పుష్పాలను గంగానదికి సమర్పించి దీపారాధన చేశారు. వారణాసిలో శ్రీమఠం నిర్మాణానికి స్థలాల పరిశీలనతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం భక్తుల్లో ఆనందాన్ని నింపింది.
నాగరాజు
మంత్రాలయం సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా