BREAKING
బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్

16వ డివిజన్ కార్పొరేటర్‌గా నాగభూషణంను గెలిపించండి:

Select Suryaa Now
16వ డివిజన్ కార్పొరేటర్‌గా నాగభూషణంను గెలిపించండి:

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా ఆర్. నాగభూషణంను గెలిపించాలని రజక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కరాటే చంద్ర, రజక సంఘం జిల్లా నేత చెంబకూరు రాజయ్య ఓటర్లను అభ్యర్థించారు.
మంగళవారం మారుతీ నగర్, రాయల్ నగర్, ఎస్వీ నగర్ ప్రాంతాలలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు,  కార్యకర్తలతో కలిసి కరాటే చంద్ర, చెంబకూరు రాజయ్య ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఆర్. నాగభూషణంను గెలిపిస్తే వార్డులోని సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా చొరవ చూపుతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనేత మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పారు.
నవంబర్ 1వ తేదీన జరిగే పోలింగ్‌లో 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్‌గా నాగభూషణంకు వరుస నంబర్ 1 (సైకిల్ గుర్తు) పై మీ అమూల్యమైన ఓట్లు వేసి, వేయించి గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే మేయర్ అభ్యర్థి   జెబీ శ్రీనివాస్ (అలియాస్ మన్యం శ్రీనివాస్ ప్రసాద్) వరుస నంబర్ 2 (సైకిల్ గుర్తు) పై మీ ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఆర్. మునిరామయ్య, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

H. Dwaraka, staff reporter 

Cell no 9705347341