BREAKING
బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్

డివిజన్ కార్పొరేటర్‌గా ఒక అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం – టీడీపీ రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్ బాషా

Select Suryaa Now
డివిజన్ కార్పొరేటర్‌గా ఒక అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం  – టీడీపీ రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్ బాషా

తిరుపతి, (మేజర్ న్యూస్):

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో 41వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ నసీమున్నీసాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీడీపీ రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్ బాషా ఓటర్లను కోరారు.
మంగళవారం 41వ డివిజన్ పరిధిలోని తిలక్ రోడ్డు, ఎస్‌కేడీ నగర్ తదితర ప్రాంతాల్లో
టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మహబూబ్ బాషా మాట్లాడుతూ... తన సతీమణి నసీమున్నీసాకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే డివిజన్‌ను అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేయడంతో పాటు, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని స్పష్టం చేశారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నేత మంత్రి నారా లోకేష్ ల ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
41వ డివిజన్ ప్రజలు ఆలోచించి, మంచి అభ్యర్థి అయిన నసీమున్నీసాను ఆశీర్వదించాలని కోరారు. గెలిపించిన నాటి నుండి ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో 
టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

H. Dwaraka, staff reporter,

Cell no 

9705347341