BREAKING
బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్

తిరుపతిలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విస్తృత ప్రచారం. చిత్తూరు శంకర్

Select Suryaa Now
తిరుపతిలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విస్తృత ప్రచారం. చిత్తూరు శంకర్

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ 

తిరుపతిలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విస్తృత ప్రచారం

మార్పు కోసం కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వండి

మేయర్ అభ్యర్థి చిత్తూరు శివశంకర్

తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిత్తూరు శివ శంకర్ విజయం కోసం తిరుపతి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేర చిట్టి బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డివిజన్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం 1, 2 డివిజన్లలోని తిమ్మినాయుడు పాలెం, మాతమ్మ హరిజనవాడ, భూపాల్ హౌసింగ్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థి చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ తిరుపతిలో సమూల అభివృద్ధి, మార్పుల కోసం కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై ముద్రించి గెలిపించాలని కోరారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ముందుంటామని పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. తనను మేయర్ అభ్యర్థిగా గెలిపిస్తే  ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ప్రశాంత వాతావరణానికి, అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు గౌడ పేరు చిట్టిబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు గత పాలకుల అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాల చరిత్రకు స్వస్తి పలకడానికి లభించిన అవకాశం అని చెప్పారు. విద్యా కేంద్రమైన తిరుపతిలో ప్రజలు రాజకీయ చైతన్యవంతులై తమదైన శైలిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాంగాటి గోపాల్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, తిరుపతి నగర మాజీ అధ్యక్షుడు యార్లపల్లి గోపి మాట్లాడుతూ తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా రాజకీయంగా కూడా ఇక్కడి ప్రజలు ఎంతో చైతన్యవంతంగా ఆలోచిస్తారని చెప్పారు. గత వైసిపి పాలనలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడ్డ ప్రజలు ఈ ఎన్నికల్లో తమ బాధలను దూరం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి చిత్తూరు శివశంకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి