BREAKING
బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన

అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం. నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్.

Select Suryaa Now
అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం.  నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్.

సూర్య న్యూస్ అద్దంకి.

అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో అద్దంకి మున్సిపాలిటీ కి కూటమి చైర్మన్ అభ్యర్ధిగా  పోటీ చేస్తున్న కాకాని అశోక్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బాగంగా పట్టణంలోని 27 వ జనసేన కౌన్సిలర్ అభ్యర్థి షేక్ రుబియా తో కలిసి వార్డ్ లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ప్రచారం లో తేదేపా నియోజకర్గ ఎన్నికల పరిశీలకులు,రాష్ట్ర తేదేపా పార్టీ కార్యదర్శి  మద్దిరాల గంగాధర్ హాజరై మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్, 29 వార్డుల్లో కౌన్సిలర్ లు గా పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
అనంతరం మున్సిపల్  ఎన్నికల పై కూటమి పార్టీ లు తేదేపా, జనసేన, బీజేపీ పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో 27 వార్డ్ తేదేపా ఇంచార్జి దామా హనుమంతరావు, మాజీ ఎంపీపీ మన్నెం ఏడుకొండలు, నియోజకవర్గ జనసేన ఇంచార్జి నరహరి, గోరంట్ల సాయి, కాకాని రాధాకృష్ణమూర్తి, బిజెపి ఇంచార్జి జాగర్లమూడి యలమందరావు, బిజెపి మహిళా నాయకులు రూపాంజలి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మహిళలు పాల్గొన్నారు.