గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం
గోపాలపురం అక్టోబర్ 27 మేజర్ న్యూస్
గోపాలపురం మండలంలో 18 ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు తుదిబరిలో 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి పి భాగ్యవతి తెలిపారు. మండలంలో దాఖలైన మొత్తం 92 నామినేషన్లకు రెండు నామినేషన్లుపరిశీలనలో తిరస్కరించబడ్డాయి .అయితే నామినేషన్ల ఉపసంహరణ లో భాగంగా 49 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నట్లు ఆర్వో భాగ్యవతి తెలిపారు.ఒకే అభ్యర్థి రెండు నామినేషన్ సెట్లు చొప్పున దాఖలు చేసినటువంటి5 లామినేషన్ లు ఉన్నట్లు తెలిపారు కాగా మండలంలోని వేళ్ళ చింతల గూడెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శారదా వాణిమండ్రు,జగన్నాధపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాట్రగడ్డ సురేష్ ఏకగ్రీవంగాఎన్నికయ్యారు.ఇది లా ఉండగా మండలంలోతెలుగుదేశం పార్టీ తరపున 12బంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతరపున అభ్యర్థులు 16 మంది కాంగ్రెస్ పార్టీ ఒకటి బిజెపి ఒకటి స్వతంత్ర అభ్యర్థి ఒకటి తో కలిపి మొత్తం 34 మందిపోటీలో ఉన్నారని ఆర్వో భాగ్యవతి తెలిపారు.