BREAKING
ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్ ఐరాస తదుపరి ప్రధాన కార్యదర్శి రేసులో యూఏఈ సీనియర్ డిప్లొమాట్ అమెరికా మధ్యవర్తిత్వ ఒప్పందంతో పునఃప్రారంభమైన చమురు శుద్ధి కర్మాగారాల ఉత్పత్తి పరగడుపునే లవంగాల నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన లాభాలివే ట్రంప్ 'డాన్‌రో డాక్ట్రిన్'కు ఎదురుదెబ్బగా లూలా విజయాలు అపోలో, అరేస్ వినూత్న వ్యూహాలపై ఆర్థిక నిపుణుల విశ్లేషణ 16వ డివిజన్ కార్పొరేటర్‌గా నాగభూషణంను గెలిపించండి: ఇన్‌స్టాకార్ట్ కొనుగోలు అత్యంత ఖరీదైన నిర్ణయం కాగలదన్న నిపుణులు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పిల్లల మెదడులో తీవ్ర మార్పులు.. నిపుణుల తాజా అధ్యయనంలో సంచలన విషయాలు

అభివృద్ధి కూటమి మంత్రం -ప్రతి డివిజన్లో ఇంటింటి హోరెత్తిన ప్రచార జోరు -మేయర్ అభ్యర్థి జేబీకి అడుగడుగునా జననీరాజనం -జననీరాజనానికి కూటమి అభివృద్ధి సాక్షి : ఎన్డీఏ మేయర్ అభ్యర్థి జేబీ ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అబివృద్ధి మంత్రం చూసి ప్రజలు చూపిస్తున్న జననీరాజన

Select Suryaa Now
అభివృద్ధి కూటమి మంత్రం -ప్రతి డివిజన్లో ఇంటింటి హోరెత్తిన ప్రచార జోరు -మేయర్ అభ్యర్థి జేబీకి అడుగడుగునా జననీరాజనం  -జననీరాజనానికి కూటమి అభివృద్ధి సాక్షి : ఎన్డీఏ మేయర్ అభ్యర్థి జేబీ  ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్:  కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అబివృద్ధి మంత్రం చూసి ప్రజలు చూపిస్తున్న జననీరాజన

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అబివృద్ధి మంత్రం చూసి ప్రజలు చూపిస్తున్న జననీరాజనానికి కూటమి అభివృద్ధే 

సాక్ష్యమని ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి జేవి శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం 

32, 33, 34, 35 డివిజన్లలో ఇంటింట ప్రచారం చేపట్టారు. కూటమి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారానికి ప్రతి డివిజన్ లోనూ అపూర్వ స్పందన లభిస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో కలిసి ప్రతి డివిజన్ లో ఇంటింటికి ప్రచారానికి వెళ్లిన వారికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.

ఈ సందర్భంగా ఓటర్లు పూల వర్షం కురిపిస్తూ, హారతులు పడుతూ కూటమి అభ్యర్థికి బ్రహ్మరథం పట్టారు. "కూటమి ప్రభుత్వానికి మేమంతా అండగా ఉన్నాము" అంటూ మహిళలు, వృద్ధులు, యువత భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. గత వైసీపీ హయాంలో తిరుపతి అభివృద్ధి కుంటుపడింది. కూటమి ప్రభుత్వం వచ్చాకే తిరుపతికి మహర్దశ పట్టింది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, లైటింగ్, పార్కుల అభివృద్ధిలో తిరుపతి దూసుకుపోతోంది. ఇదే స్ఫూర్తితో తిరుపతి అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. మేయర్ గా గెలిపిస్తే తిరుపతిని స్మార్ట్ సిటీగా, ఆధ్యాత్మిక, పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దుతాను" అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ..."జేబీ శ్రీనివాస్ లాంటి అనుభవజ్ఞుడు, సేవా తత్పరుడు మేయర్ అయితే తిరుపతి అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. ప్రతి డివిజన్ లో వస్తున్న స్పందనే దీనికి నిదర్శనం అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ సుగుణమ్మ, తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్