క్రీడలతో శారీరక, మానసిక వికాసం
క్రీడలతో శారీరక, మానసిక వికాసం
కందుకూరు: క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి అన్నారు. మంగళవారం కందుకూరులోని శ్రీ చైతన్య పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ మహేశ్వరం జోనల్ స్థాయి కబడ్డీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని, ఈ ప్రాంతం నుంచి మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉందన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, ఓటమి ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాణా ప్రతాప్ రెడ్డి, సర్పంచులు సరికొండ పాండు, బాలరాజు, శ్రీను నాయక్, మహేశ్వరం జోనల్ సెక్రెటరీ అబ్దుల్లా పిడిఎస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి భాస్కర్ రాష్ట్ర నాయకులు చంద్రమోహన్, ఉపాధ్యాయులు మల్లీశ్వరి, సుధా, కిరణ్, శేఖర్, బురాన్, గణేష్, తేజ,స్థానిక నాయకులు కార్తీక్, దీక్షిత్ రెడ్డి,రవీందర్, రాజశేఖర్ రెడ్డి, రమేష్,వినోద్, మధు, జగదీష్ క్రీడా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
టి శ్రీనివాస్, మేజర్ న్యూస్.