మాటలు చెప్పను అభివృద్ధి చేసి చూపిస్తా -60వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రాజకీయ లబ్ధి, తన స్వార్థం కోసం మాటలు చెప్పేవాడిని కాదని, అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తానని 60వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రచారంలో భాగంగా బుధవారం అక్కారం పల్లి ప్రాంతంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పనిచేసిన అనుభవంతో డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, అందుకు మీరందరూ సహకరించి రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్లిన దగ్గర ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజల సమస్యలు తెలిసిన వాడివి కాబట్టి మా ఓటు నీకే వేస్తామని ఆయనకు చేతిలో చేయి వేసి ఓటర్లు భరోసా ఇచ్చారు. ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనకు నవంబర్ ఒకటో తేదీ జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వరుసు నెంబర్ 3 స్టావ్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూర్ణచంద్ర, ఏ రాజశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పొన్నం ప్రసాద్, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్