BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

అనుభవానికి పట్టం కట్టండి... -60వ డివిజన్ పరిధిలో ఆదం సుధాకర్ రెడ్డి

Select Suryaa Now
అనుభవానికి పట్టం కట్టండి... -60వ డివిజన్ పరిధిలో ఆదం సుధాకర్ రెడ్డి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : 30 ఏళ్ల పాటు రాజకీయం అనుభవం కలిగిన తనను రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు కార్పొరేటర్ గా అవకాశం కల్పించాలని ఆదం సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా గురువారం 60వ డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలతో ఆప్యాయంగా పలకరిస్తూ వరుస నెంబర్ 3 గ్యాస్ స్టవ్ కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తిమ్మినాయుడు పాలెం సర్పంచిగా పనిచేసే ప్రజల ఆదర అభిమానం పొందానని, గతంలో పని చేసిన అనుభవంతో డివిజన్ ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపిస్తాను అండగా నిలవాలని ఓటర్లను కోరారు. గత అనుభవంతో సుభాష్ నగర్ ప్రాంతంలో కాలువ సమస్యను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధికి దోహదపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మిట్టపల్లి ముని కృష్ణారెడ్డి, ఆలత్తూరు మునికృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, శివారెడ్డి, కేతన్ పురుషోత్తం, రెడ్డి, పూర్ణ ప్రసాద్, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్