గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 58వ డివిజన్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని రాజారెడ్డి హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా గురువారం ఆ డివిజన్ పరిధిలోని చింతల్ చేను ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి నన్ను ఆదరించండి.. సమస్యలు లేని డివిజన్ గా చేసి చూపిస్తానని కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. ఎమ్మెల్యే సహకారంతో కాలువలు, డ్రైన్లు, త్రాగునీరు సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. నవంబర్ ఒకటో తేదీ జరిగే నగరపాలక సంస్థ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి, కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో ఆ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కూటమి నాయకులు నవీన్, జీవన్, దుర్గా, పురుషోత్తం, హేమంత్, సాయి, జయ బాబు, రమేష్, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్