ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే
సూర్య హెల్త్ డెస్క్: ప్రతి ఇంటి వంటగదిలో లభించే కరివేపాకును కేవలం పోపు దినుసుగానే కాకుండా ఒక గొప్ప దివ్య ఔషధంగా ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. చాలా మంది కూరల్లో ఉండే కరివేపాకును పక్కన పడేస్తుంటారు కానీ, దీనివల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఎవరూ వదిలిపెట్టరు. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున కరివేపాకుతో తయారుచేసిన పానీయాలను లేదా జ్యూస్‌ను క్రమం తప్పకుండా ముప్పై రోజుల పాటు తీసుకుంటే శరీరం లోపల నుంచి పూర్తిగా ఆరోగ్యవంతంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో మధుమేహ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో డయాబెటిస్ ఉన్నవారికి కరివేపాకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కరివేపాకులో లభించే ప్రత్యేకమైన ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహకరిస్తాయి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున దీన్ని సేవించడం ద్వారా ఇన్సులిన్ స్రావం మెరుగై శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు క్రమబద్ధీకరించబడతాయి.
అలాగే శరీరంలో పెరిగిపోయిన అధిక బరువును, కొవ్వును సహజద్ధంగా తగ్గించుకోవడానికి కరివేపాకు జ్యూస్ ఒక అద్భుతమైన మార్గంగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగవడమే కాకుండా శరీరంలోని మెటబాలిజం వేగవంతమై అదనపు కొవ్వు కరిగిపోవడానికి తోడ్పడుతుంది. కరివేపాకులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఈ ఆరోగ్యకరమైన పానీయాల తయారీ విధానం కూడా చాలా సులభం అని చెప్పవచ్చు. తాజా కరివేపాకులను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి గ్లాసు నీటిలో మరిగించి లేదా గ్రైండ్ చేసి జ్యూస్‌లా తయారు చేసుకోవచ్చు. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా చర్మాన్ని రక్షించడంతో పాటు జుట్టు రాలే సమస్యను తగ్గించడంలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా తీసుకున్న తర్వాత ఈ ఆహారపు అలవాటును పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే