దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..!
సూర్య అంతర్జాతీయ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ అమెరికన్ లా డిగ్‌జం 'వీల్, గాట్షల్ అండ్ మాంజెజ్' (Weil, Gotshal & Manges) సంస్థ ఊహించని రీతిలో ముగింపు దశకు చేరుకోవడం లీగల్ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తొంబై సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఎలైట్ లా ఫర్మ్ మూసివేత దిశగా అడుగులు వేయడం కార్పొరేట్ న్యాయవాద రంగంలో కలకలం రేపింది. బిలియన్ల కొద్దీ ఆదాయాన్ని ఆర్జించే బడా లా సంస్థల వెనుక దాగివున్న పెళుసైన ఆర్థిక నిర్వహణ లోపాలను, భాగస్వాముల మధ్య నెలకొన్న విభేదాలను ఈ పరిణామం బట్టబయలు చేసింది.
గత కొన్ని వారాలుగా ఫర్మ్‌లోని కీలక భాగస్వాములు (Partners) వరుసగా బయటకు వెళ్లడం, విలీన చర్చలు విఫలం కావడం మరియు నాయకత్వంలో అనిశ్చితి నెలకొనడంతో సంస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. స్వతంత్రంగా కొనసాగేందుకు లేదా ఇతర ప్రత్యర్థి సంస్థలతో జట్టుకట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, చివరికి పరిస్థితిని చక్కదిద్దేందుకు పునర్నిర్మాణ (Restructuring) నిపుణులను ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఏళ్ల తరబడి కార్పొరేట్ దిగ్గజాలకు సలహాలు అందించిన వీల్ సంస్థే నేడు క్లోజింగ్ దిశగా ప్రయాణించడం పట్ల న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో బడా లా పర్మ్‌లు అత్యంత భారీ వేతనాలు, రిక్రూట్‌మెంట్ వ్యూహాలు మరియు లాభాల పంపిణీపై ఆధారపడుతుండటమే ఈ పతనానికి అసలు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది మంది భారీ ఆదాయం తెచ్చిపెట్టే స్టార్ భాగస్వాములు ఇతర సంస్థల వైపు ఆకర్షితులై వెళ్ళిపోవడం, సంస్థ నిర్వహణలో పారదర్శకత లోపించడం వంటి అంశాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ప్రపంచ స్థాయి కార్పొరేట్ లీగల్ రంగంలో బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్న సంస్థలు కూడా అంతర్గత కుమ్ములాటలు మరియు ఆర్థిక అనిశ్చితి కారణంగా ఎంత త్వరగా కుప్పకూలవచ్చో వీల్ ఉదంతం కళ్లకు కడుతోంది.