మధురకు డాక్టరేట్ ప్రదానం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ కంప్యూటర్ సైన్స్ విభాగం పరిశోధకురాలు పి.మధురకు డాక్టర్ ప్రధానం చేసినట్లు సిఈ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ప్రొఫెసర్ ఎం.పద్మావతమ్మ పర్యవేక్షణలో డెవలప్మెంట్ ఆఫ్ పర్సనలైజ్డ్ లర్నింగ్ సిస్టమ్ యూజింగ్ ప్రైవసీ ప్రెసెర్వింగ్ త్రెసోల్డ్ సీ4.5 టెక్నిక్ అనే అంశంపై పరిశోధన పత్రాలను సమర్పించారు. ఇందుకుగాను మధురకు డాక్టరేట్ ప్రధానం చేసినట్లు వెల్లడించారు. ఆమె డాక్టరేట్ సాధించడం పట్ల అధ్యాపకులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్