జ్ఞాన పరంపరకు అవధానం మూల స్తంభం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : భారతీయ జ్ఞాన పరంపరకు అవధానం మూల స్తంభమని జాతీయ సంస్కృత వర్సిటీ ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తి పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడస్తున్న ఎస్వీ ఓరియెంటల్ కళాశాలలో గత మూడు రోజులగా జరుగుతున్న అవధాన అవగాహన సదస్సు కార్యక్రమానికి ఆయన గురువారం ప్రధాన ఉపన్యాసకులుగా హాజరయ్యారు. అయన విద్యార్థుల నుద్ధేశించి మాట్లాడుతూ ఏకాగ్రత, భాషపై పట్టు, వ్యాకరణం వంటివి అవధాన ప్రక్రియతో పెంపొందించుకోవచ్చన్నారు. వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి అనే అంశాలపై విద్యార్థులు అవగాహన కల్పించారు. అవధానంలో ప్రధాన అంశాలైన సమస్యాపూరణం, నిషిద్దాక్షరి, వర్ణన, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలపై అతిథులు ఉపన్యసించారు. శుక్రవారం శతావధాని, విద్యావాచస్పతి డాక్టర్ తాతా సందీప్ శర్మచే అష్టావధాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ సీతారామరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాకాల డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతులు ఈశ్వర్బాబు, ఉమామహేశ్వర్రావు, శతావధాని ఆముదాల మురళి, రొంపిచర్ల యశ్వంత్ దీక్షితులు, డాక్టర్ హేమంత్ కుమార్, అధ్యాపకులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ రవీంద్ర, డాక్టర్ పురందేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్