ఆడబిడ్డని ఆదరించండి అమ్మ... -సుభాషిణికి గెలుపుకు డా.పసుపులేటి హరిప్రసాద్ ప్రచారం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : 60వ డివిజన్ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆకేపాటి సుభాషిణిఆడబిడ్డను మహిళలందరూ ఆదరించి ఓటు వేయాలని ఏపీ హస్తకళ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కోరారు. ప్రచారంలో భాగంగా గురువారం కొర్లగుంట ప్రాంతంలో కార్పొరేటర్ అభ్యర్థితో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలందరకు సంక్షేమ అభివృద్ధి ప్రశాంతమైన వాతావరణ పిల్లలకు మెరుగైన భవిష్యత్తుకు సదుపాయాల కల్పనకు సుభాషిణికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న మహిళా అభ్యర్థి ఆకేపాటి సుభాషిణికి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. 60వ వార్డు అభివృద్ధికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ అమూల్యమైన ఓటును ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు రాజేష్ యాదవ్, హేమ కుమార్, వంశీ గంగుపల్లి, నరేష్ రెడ్డి, భీమా, శిరీష, ధరణి, రవి, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్