BREAKING
ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు! పిల్లలకు పదే పదే తీపి పానీయాలు ఇస్తున్నారా.. ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవు జ్ఞాన పరంపరకు అవధానం మూల స్తంభం

తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్

Select Suryaa Now
తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్

తిరుపతి, మేజర్ న్యూస్ :

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. కూటమి మేయర్ అభ్యర్థి మన్యం శ్రీనివాస ప్రసాద్ @ జేబీ శ్రీనివాస్ ప్రచారం హోరెత్తుతోంది. కార్పొరేటర్ తో కలిసి  మేయర్ అభ్యర్థి ఇంటింటికీ తిరుగుతూ మెరుపు వేగంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలోని పలు డివిజన్లల రోడ్ షో లకు, పాదయాత్రలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రచారం చివరి దశకు వచ్చింది కానీ ప్రజల్లో ఉత్సాహం మొదటి రోజులా ఉంది. తిరుపతి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఈసారి కూటమికే పట్టం కట్టాలని. నేను తిరిగిన ప్రతి ఇంట్లో, ప్రతి షాపులో ఒకటే మాట వినిపిస్తోంది చెప్పాం చేస్తున్నాం చేస్తాం అని. గత వారం రోజులుగా నేను ప్రచారం చేయలేదు, ప్రజల కష్టాలు విన్నాను. మేయర్ అయిన వెంటనే అన్నింటిని పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, ప్రణిత్, మాజీ ఎమ్మెల్యే మోహన్, వూకా విజయ్ కుమార్, చిన్నంగారి రమణ పాల్గొన్నారు.
పలువురు టిడిపిలో చేరిక 
 

* వైసీపీ నాయకులు చింతా రమేష్ యాదవ్ వారి అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

* తిరుపతి పట్నాలు వీధిలో ఉన్న కూరగాయల మార్కెట్ వ్యాపారులు  తెలుగుదేశం పార్టీ లోకి చేరారు. వీరికి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

H. Dwaraka, staff porter,

9705347341

.