BREAKING
మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన* దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో సురేష్ రెడ్డి

వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ - 29 నేరాలు వెలుగులోకి

Select Suryaa Now
వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ - 29 నేరాలు వెలుగులోకి

 

నల్లగొండ టౌన్, మేజర్ న్యూస్:రైతుల వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను వరుసగా దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురిని నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
వేములపల్లి పీఎస్ పరిధిలో L-15 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు చెందిన 500 KVA ట్రాన్స్‌ఫార్మర్ లోని 300 కిలోల కాపర్, 250 లీటర్ల ఆయిల్ చోరీపై కేసు నమోదైంది.
దీనితో ఎస్పీ ఆదేశాలతో మిర్యాలగూడ డీఎస్పీ జి. రవి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
వేములపల్లి శివారు సూర్యాపేట X రోడ్డు వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పద ఎర్టిగా కారును ఆపారు.
కారులో ఉన్న పాత నేరస్థుడు షేక్ చంద్ పాషా (26) తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వారి విచారణలో హయత్‌నగర్ కు చెందిన రిసీవర్ ఇస్లావత్ దేశిరామ్ (24) ను కూడా పట్టుకున్నారు.
మిగిలిన నిందితులు రామావత్ సూర్య (19), గలబ సాయి కిరణ్ (19).
వీరు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 29 నేరాలకు పాల్పడ్డారు, అందులో నల్లగొండ జిల్లాలోనే 18.
వేములపల్లి, వాడపల్లి, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, హాలియా, త్రిపురారం, కనగల్, దేవరకొండతో పాటు ఇతర జిల్లాల్లో, ఏపీలో పల్నాడు, దాచేపల్లిలలో చోరీలు చేశారు.
జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు కోసం ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
గ్రామాలకు దూరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి రాత్రి వేళ కార్లలో వెళ్లి చోరీ చేసేవారు.
పోలీసులకు అనుమానం రాకుండా ముఠాలోని మహిళలను వెంట తీసుకెళ్లేవారు, నకిలీ నంబర్ ప్లేట్లు వాడేవారు.
పానాలు, కట్టర్లతో ట్రాన్స్‌ఫార్మర్లను కట్ చేసి కాపర్, ఆయిల్ దొంగిలించి హయత్‌నగర్ లో అమ్మేవారు.
వారి నుండి రూ.30 లక్షల విలువైన 2 కార్లు, రూ.20 లక్షల నగదు, కాపర్ వైర్, కట్టర్లు, పానాలు, గ్లౌజులు, 3 ఫోన్లు స్వాధీనం చేశారు.
100% రికవరీతో రైతులకు భరోసా కల్పించామని ఎస్పీ తెలిపారు.
ముఠాలోని మరో ఐదుగురు సంతోష్, నాన్కు, మోడల్ సాయి, ప్రియా, సునీత పరారీలో ఉన్నారన్నారు.
కేసు ఛేదించిన సీసీఎస్, మిర్యాలగూడ పోలీసు బృందాలను ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు.